Rain | హైదరాబాద్లో పలుచోట్ల వర్షం.. చిరుజల్లులు
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం, చిరుజల్లులు (Rain) కురిశాయి. మంగళవారం ఉదయం సైదాబాద్, చంపాపేట్, సరూర్నగర్, మాదన్నపేట, మలక్పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం, చిరుజల్లులు (Rain) కురిశాయి. మంగళవారం ఉదయం సైదాబాద్, చంపాపేట్, సరూర్నగర్, మాదన్నపేట, మలక్పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కర్మాన్ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠితోపాటు పలుచోట్ల వాన పడింది. ఇక కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నది.
కాగా, రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
— kutharamp OG (@nanisumanth29) March 19, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

