సిటీబ్యూరో, అక్టోబర్ 3 ( నమస్తే తెలంగాణ ) : లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. గ్రేటర్లో లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో గత రెండేండ్లుగా రంగారెడ్డిలో అధికంగా ఉండేది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హైదరాబాద్ రూ.812 కోట్ల వసూలు చేసింది. రాష్ట్రం మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికి (2023- 24) గానూ ఇప్పటి వరకు 1991 కోట్ల లైఫ్ ట్యాక్స్ జమ కాగా, ఇందులో రంగారెడ్డి రూ.610 కోట్లు, మేడ్చల్ రూ.412 కోట్లు ఉంది.
రాష్ట్రంలో అత్యధిక లైఫ్ ట్యాక్స్ వసూలైన జిల్లాగా ఇప్పటి వరకు హైదరాబాద్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 2022- 2023కు గానూ రూ.1740 కోట్లు వసూలైంది. కాగా, ఈ ఆరు నెలల్లోనే గత ఆర్థిక సంవత్సరానికి మించి లైఫ్ ట్యాక్స్ వసూలు కావడం విశేషం. అత్యధికంగా విలువజేసే వాహనాల వినియోగం కూడా నగరంలోనే ఉండటం కూడా హైదరాబాద్కు కలిసి వచ్చింది.