డ్రగ్స్ లేని సిటీగా మార్చుదాం
మనిషి జీవితం దారంలాంటిదని, దారం తెగితే అతుకులే మిగులుతాయని టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీసీ అవినాశ్ మహంతి అన్నారు.
- కళాశాలల్లో కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తాం
- మత్తు పదార్థాలు విక్రయించే వారిపై పీడీయాక్ట్
- బిట్స్ పిలానీలో జరిగిన సదస్సులో టీఎస్ నాబ్ డైరెక్టర్
- సందీప్ శాండిల్య, సీపీలు సుధీర్‌బాబు, అవినాశ్ మహంతి
జవహర్‌నగర్, ఫిబ్రవరి 10 : మనిషి జీవితం దారంలాంటిదని, దారం తెగితే అతుకులే మిగులుతాయని టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీసీ అవినాశ్ మహంతి అన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ లేని సిటీగా మారుద్దామని పిలుపునిచ్చారు. బిట్స్ పిలానీ క్యాంపస్‌లో యాంటీ డ్రగ్స్‌పై రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై ప్రసంగించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 12మందిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేసి రూ.5కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నామని చెప్పారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకంపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సిలెట్ అధికారి ఎర్న్ఫిషర్, సీఐలు సీతారాం, రాములు, డీఐ శ్రీనివాస్, ఎస్సైలు అనిల్‌యాదవ్, అనిల్‌కుమార్, వేణు, పోలీసులు సిబ్బంది, బిట్స్ పిలానీ క్యాంపస్ సిబ్బంది, సుమారు 2500మంది యువత పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

