గోల్నాక, సెప్టెంబర్ 15: అంబర్పేట నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ బీజేపీ మహిళా మోర్చాకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓ వైపు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. మరోవైపు అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు నర్సింగ్యాదవ్, ఆశలత తదితరులు పాల్గొన్నారు.