హైదరాబాద్ : పగలు అతడు భిక్షాటన చేస్తాడు. అయ్యా ధర్మం అంటాడు. తనకు కాళ్లు సరిగ్గా లేనట్టు.. నడవలేనట్టు యాక్ట్ చేస్తాడు. అతడి ప్రవర్తనను చూసి అయ్యోపాపం అని అనుకొని తలా ఇంత డబ్బులు ఇస్తారు జనాలు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు భిక్షం ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో రాత్రి పూట ఫుల్లుగా మద్యం తాగుతాడు. ఆ తర్వాత దొంగతనాలు చేస్తాడు.
అతడి రోజు వారి పని ఇదే. చివరకు ఓ వ్యక్తితో గొడవపడి ఆ వ్యక్తి మృతికి కారణం అయ్యాడు ఈ బిచ్చగాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి గురించి తెలుసుకొని షాక్ అయ్యారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలుసుకొని వెంటనే అతడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.