మేడ్చల్ జోన్ బృందం, సెప్టెంబర్ 7: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు చిన్నికృష్ణుడు, రాధా వేషధారణలో ఆకట్టుకున్నారు. జన్మాష్టమి సంద ర్భంగా గోపూజ,తులసి హారతి, లడ్డూ గోపాల్ ఉయ్యాల సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, బహుమతుల ప్రదానం, మహాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం మహా ప్రసాద వితరణతో కార్యక్రమంతో ముగించారు.