కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉండేది కాదు. భూ వివాదాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద మొత్తంలో కొనుగోలుదారులకు దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన భూములను అప్పగించలేకపోయారు. ఫలితంగా కోకాపేట స్థలాలు బీడుగానే ఉండిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ, చక్కటి విధానాలు, ప్రణాళికాబద్ధమైన చర్యలతో ఇప్పుడు కోకాపేట ప్రాంతం ‘రియల్’ రారాజుగా నిలుస్తున్నది.
వివాదాలు లేని క్లియర్ టైటిల్‌తో ఉన్న భూములను సర్కారు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా వేలం వేస్తుండటంతో నిర్మాణ రంగం పరుగులు పెడుతున్నది. గతేడాది హెచ్ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను 529 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించి.. ఆన్లైన్లో విక్రయించగా, అనూహ్య స్పందన వచ్చింది. ఎకరా ధర అత్యధికంగా రూ.60 కోట్ల దాకా పలికింది. ఈ లేఅవుట్లో భూములు కొన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆకాశహార్మ్యాలను నిర్మిస్తుండగా, మరో వైపు 150, 120,100 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది హెచ్ఎండీఏ.
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): సుస్థిరమైన ప్రభుత్వం..అనుకూలమైన ప్రభుత్వ విధానాలు..వెరసి ఐటీ కారిడార్‌లో కోకాపేట ఆకాశమే హద్దుగా అన్నట్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోకాపేట భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కోకాపేట భూముల విషయంలో తీసుకున్న చొరవతో ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం పనులు పరుగులు పెడుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలోని వేలం పాట భూముల్లో ఏండ్ల తరబడి చిక్కులు ఎదురైతే.. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా భూముల విషయంలో వివాదాలు లేకుండా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా వేలం వేస్తున్నది.అలా కోకాపేటలో గతేడాది హెచ్ఎండీఏ నియోపోలీస్ లేఅవుట్‌ను 529 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించి, ఆన్లైన్లో విక్రయించగా అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఎకరా ధర అత్యధికంగా రూ.60 కోట్ల దాకా పలికింది. కోకాపేట నియోపోలీస్లో లేఅవుట్లో భూములను కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ బహుళ అంతస్థుల ఆకాశ హార్యాలను నిర్మిస్తుండగా, మరో వైపు 150, 120,100 అడుగుల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులను హెచ్ఎండీఏ కల్పిస్తున్నది. ఒకవైపు నిర్మాణాలు, మరోవైపు లేఅవుట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ కారిడార్‌లో అద్భుతమైన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. మరో 3-4 ఏళ్లలోనే పలు ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యేలా కంపెనీలు పనులను వేగంగా నిర్వహిస్తున్నాయి.
వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మంది పని చేసేలా..
హెచ్ఎండీఏ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న నియోపోలీస్ లేఅవుట్‌ను మినహాయిస్తే దాని చుట్టు పక్కల ఆనుకొని భూముల్లోనూ ఇప్పటికే భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగ్లు 30 నుంచి 57 అంతస్థుల వ్యాపార, వాణిజ్య భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులే అత్యధికంగా ఉన్నాయి. ఐటీ పరంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయిదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోవడంతో ఇప్పుడంతా కోకాపేటపైనే ఐటీ కంపెనీలు దృష్టిసారించాయి. దానికి అనుగుణంగానే కోకాపేటలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కోకాపేట ప్రాంతంలో వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మంది పని చేసుకునేలా అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నది.
దూర దృష్టితో కోకాపేట అభివృద్ధిపై ఫోకస్..
ఐటీ కారిడార్‌లో భాగంగా మారిన కోకాపేటలో ఉన్న ప్రభుత్వ భూములపై వివాదాలు లేకుండా చేసి, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీ కారిడార్‌ను, ఔటర్ రింగు రోడ్డును అనుకొని కోకాపేటలోని 500 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వం భూముల వినియోగంపై ప్రత్యేక కసరత్తు చేసి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా కోకాపేట నియోపోలీస్ ప్రాజెక్టును ప్రకటించింది.
గ్రీన్ ఫీల్డ్ వర్క్‌స్పేస్ టౌన్ షిప్‌గా కోకాపేట..
దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో మరే ఇతర మెట్రో నగరాల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయని విధంగా కోకాపేటలో భారీ లేఅవుట్‌ను నియోపోలీస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్నది. సుమారు 529 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టింది. ఇందులో 150, 120 అడుగుల వెడల్పుతో విశాలైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం లేఅవుట్లోనే 400కేవీ సబ్ స్టేషన్ కోసం 5.3 ఎకరాలు, జలమండలి నిర్మించే మంచినీటి పంప్‌హౌస్ కోసం మరో 9.30 ఎకరాలు కేటాయించి లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లను వెచ్చిస్తున్నారు. నగర శివారులో ఉండే ఈ లేఅవుట్లో ఎలాంటి జోనల్ పరిమితులు లేకుండామల్టీ యూజ్ జోన్ (బహుళ వినియోగ)గా కోకాపేట లేఅవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్నది. ఈ లేఅవుట్లో చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.
కోకాపేట లేఅవుట్‌ను కలుపుతూ లింకు రోడ్లు..
కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌కు అనుసంధానంగా లింకురోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. నగరంలోని మెహిదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ రెండు లింకు రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా విభాగంలో రోడ్ డెవలప్మెంట్ ప్లాన్‌ను రూపొందించింది. ఆయా రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ, మార్కింగ్ వంటి పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
నియోపోలీస్ లేఅవుట్‌ను కలుపుతూ..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఔటర్ రింగు రోడ్డు పెట్టుబడులకు ప్రత్యేకాకర్షణగా మారింది. అలాంటి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌తో అనుసంధానిస్తూ ట్రంపెట్‌ను హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. ట్రంపెట్ నిర్మాణం పూర్తయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల వ్యవధిలోనే కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌కు చేరుకునేలా మార్గాన్ని అత్యాధునిక శైలిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేఅవుట్ అభివృద్ధి పనులను పూర్తి చేసే లక్ష్యంతో హెచ్ఎండీఏ అధికారులు పని చేస్తున్నారు.
కోకాపేటలోనే కుల సంఘాలకు భవనాలు..