Hyderabad | నేటి నుంచి కైట్ ఫెస్టివల్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేటి నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2024 జరుగనున్నది.
Hyderabad | సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేటి నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2024 జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగించాలని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ సూచించారు. తివోలి క్రాస్ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డు వరకు రహదారిని మూసేసి, ట్రాఫిక్‌ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ, ఎస్బీహెచ్, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్ జంక్షన్స్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్బన్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, పారడైజ్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులు తమ ప్రయాణాలను సాఫీగా చేసే విధంగా ఫ్లాన్ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైలు సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రౌండ్‌కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

