Auto Driver | కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడని హైదరాబాద్ ఆటో డ్రైవర్ అన్నారు. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్నెస్ డబ్బులు మాఫీ చేశారని ఆటోడ్రైవర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎంజే మార్కెట్లో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ.. నిన్న ఆర్టీసీ వాళ్లతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా.. అని రేవంత్ సర్కార్ను ప్రశ్నించాడు. మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. జిల్లాలకు సంబంధించిన ఆటోలు హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి చాలని విజ్ఞప్తి చేశాడు.
మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.. మా దగ్గరకు వచ్చి మాట్లాడరా.. మా కన్నీళ్లు తుడవరా..? డిస్ట్రిక్ట్ ఆటోలు ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి రావొద్దని మీరే చెప్పారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ వేల కొద్దీ జిల్లా ఆటోలే నడుస్తున్నయి. గతంలో బాగుండే కేసీఆర్ ఉన్నప్పడు దేవుడిలెక్క ఆదుకున్నడు. ఆయన ఆటోవాళ్లకు ఫిట్నెస్ మాఫీ చేసిండు. రూ.35 వేలు ఆటో ఫిట్నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించా. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
రేవంత్ రెడ్డి మీ మనవడి దగ్గర పుట్ బాట్ ఆడేందుకు టైం ఉంది. మనవడికి ఫుట్ బాల్ ఆడుకోవడానికి పార్క్ కట్టించాడు. పేదల బతుకులు చూడవా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ పెద్ద చోర్.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డిది రాను రాను మా బ్రతుకే అయితది. రోడ్లపైకి వస్తే రాళ్లతో కొడ్తరని రేవంత్ రెడ్డికి అర్థమైంది. సర్కార్ రాగానే కంచెలు బద్దలు కొట్టాం. ప్రజాపాలనలో ఎక్కడడైనా ధర్నా చేసుకోవచ్చన్నాడు. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడు.. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్నెస్ డబ్బులు మాఫీ చేశాడు
రూ.35000 ఆటో ఫిట్నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించాను
కానీ రేవంత్… https://t.co/cGSZis8ihZ pic.twitter.com/Z2WoWfGuqb
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!