హైదరాబాద్ : ఓ రోగి బంధువు పీజీ విద్యార్థి శివశంకర్ పై దాడి చేశాడని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానలో విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు భద్రత పెంచాలని, దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, గాంధీ దవాఖానలో వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందింది. ఛాతీ సంబంధిత సమస్యతో గాంధీ మెడికల్ కాలేజ్ బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ హాస్పిటల్లో చేరారు.
పల్లవికి మొదటి సర్జరీ విఫలం కావడంతో రెండోసారి వైద్యులు సర్జరీ చేసినట్లు తెలిసింది. రెండవసారి సర్జరీ చేసినా బ్లీడింగ్ ఆగలేదని, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని పల్లవి కుటుంబ సభ్యుల ఆరోపించారు. పల్లవి మృతదేహం అప్పగించడంలేదని ఆవేదన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
ఓ రోగి బంధువు పీజీ విద్యార్థి శివశంకర్ పై దాడి చేశాడని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు
విధుల్లో ఉన్న డాక్టర్లకు భద్రత పెంచాలని, దాడులు జరగకుండా… pic.twitter.com/UU3giJmVuP
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026