Jagadish Reddy | బాల్కసుమన్‌పై పెట్టిన సెక్షన్లు చూసి జడ్జి ఆశ్చర్యపోయారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ ఫిర్యాదు చేయించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Jagadish Reddy | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను చంచల్ గూడ జైలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. అనంతరం జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ..అక్రమ కేసులు పెట్టి చంచల్‌గూడ జైలులో నిర్బంధించిన మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మేం బీఆర్ఎస్ పార్టీ తరపున కలిశామన్నారు.
ఈ కేసు చూసినప్పుడు వాళ్లు పెట్టిన సెక్షన్లు చూసి జడ్జిగారే ఆశ్చర్యపోయారు. అసలు బాల్క సుమన్ మాట్లాడిందేంది.. మీరు పెట్టిన సెక్షన్లు ఏంది..ఆయుధాలు పట్టుకున్నట్టు ఎవరినో చంపేందుకు ప్రయత్నించినట్టు దేశద్రోహానికి పాల్పడినట్టు మొత్తం దేశంలో ఎన్ని రకాల సెక్షన్లున్నాయో అన్ని తీసుకువచ్చి ఇందులో పెట్టిర్రు. కోర్టే వారికి మొట్టికాయలు వేసి ఈ సెక్షన్లను కూడా తీసేయాలని చెప్పడం జరిగిందన్నారు.
బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ ఫిర్యాదు చేయించారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. మా పార్టీ ఎప్పుడూ కూడా హింసను ప్రేరేపించదు.. కేసీఆర్ కూడా వాటిని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇదంతా బీఆర్ఎస్ నాయకులను అణచివేయడానికి, భయపెట్టించేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదన్నారు జగదీష్ రెడ్డి.
మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్‌ను పేల్చేస్తామని, అడివిలోకి పోయి తుపాకులు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను చంపేస్తామని గతంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు.. అప్పుడు మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు..లేనిది సృష్టించి బాల్క సుమన్ మీద అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జైళ్లు, కేసులు ఏమీ మాకు కొత్త కాదు.. ఈ అణిచివేతని ఎదుర్కొని తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు చంచల్ గూడ జైలులో పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
దేశంలో ఎన్ని రకాల శిక్షలు ఉండాలో అన్ని రకాల శిక్షలు పెట్టి అక్రమ కేసులో మా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు
కోర్టే స్వయంగా మొట్టికాయలు వేసి ఆ సెక్షన్లు… https://t.co/yMOkX5KZ9p pic.twitter.com/WOa1lN6ci4
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

