Public Voice | ఈసారి కూడా కేసీఆర్ గెలిస్తే.. బస్తీ దవాఖానలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల లెక్క మారుతాయేమో!
Public Voice | పొద్దుగాల పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాక డాక్టర్లు ఉంటున్నరు. దగ్గు, జెరం, షుగర్, బీపీ గోలీలు ఉత్తగనే ఇస్తున్నరు. గర్భిణులకు టెస్టులు చేస్తున్నరు. బలం గోలీలు ఇస్తున్నరు. ఈడికి వచ్చె ఓపిక లేకపోతె ఫోన్ చేస్తె సుత మందులు చెప్తున్నరు.
Public Voice | పొద్దుగాల పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాక డాక్టర్లు ఉంటున్నరు. దగ్గు, జెరం, షుగర్, బీపీ గోలీలు ఉత్తగనే ఇస్తున్నరు. గర్భిణులకు టెస్టులు చేస్తున్నరు. బలం గోలీలు ఇస్తున్నరు. ఈడికి వచ్చె ఓపిక లేకపోతె ఫోన్ చేస్తె సుత మందులు చెప్తున్నరు. బస్తీ దవాఖానలు వచ్చినంక మాకు చాలా పాయిదా అయితుంది. ఒకప్పుడు జెరమొస్తే ఖైరతాబాద్కో, గాంధీకో పోతుంటిమి. పొద్దంతా దవాఖాన సుట్టు తిరుగుడుకే సరిపోయేది. లేదంటే.. ప్రైవేట్ డాక్టర్. ఆడికి పోతే పైసల్ జాడియ్యాల్సి వస్తుండె.
పేదోళ్ల పానాల గురించి, ఆరోగ్యం గురించి ఆలోచించి కేసీఆర్ చేసిన బస్తీ దవాఖాన ఆలోచన మా అసోంటి పేదలకు ఎంతో మేలు చేశింది. ఇక్కడ గోలీలు ఫ్రీగ వస్తున్నయ్. మా గల్లీల ఉన్న దవాఖానకే రోజుకు వందలమంది వస్తుంటరు. డాక్టర్లు కూడా ఓపికగ చెక్ చేశి చెప్తున్నరు. అసొంటిది హైద్రాబాద్ మొత్తంల ఉన్న బస్తీ దవాఖానాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నయో ఆలోచించుండ్రి. ప్రైవేట్ దవాఖానలల్ల కూడా దొరని సౌలతులు ఇకడ అయినయ్. ఇప్పుడు సుస్తీ చేస్తే బస్తీ దాటాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా కేసీఆర్ సార్ గెలిస్తే.. బస్తీ దవాఖానలే సూపర్ స్పెషాలిటీ దవాఖానల లెక్క మారుతయేమో. నాకైతే ఆయనే వస్తడు.. చెప్పినవి చేస్తడన్న నమ్మకం ఉంది.
-బాబు, టిఫిన్ సెంటర్, ఎల్లారెడ్డిగూడ, జూబ్లీహిల్స్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

