Jalasoudha | గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై జలసౌధలో 8 రాష్ట్రాల అధికారుల భేటీ
Jalasoudha | గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.

హైదరాబాద్: గోదావరి – కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లో శుక్రవారం నాడు సమావేశం జరిగింది.
జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన ఈ సంప్రదింపుల భేటీకి భాగ్యనగరంలోని జలసౌధ వేదికైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి – కావేరి లింక్ కోసం డీపీఆర్ రూపొందించామని భోపాల్ సింగ్ తెలిపారు.
అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని, డీపీఆర్‌పై ఆయా రాష్ట్రాలు కూడా తమతమ అభిప్రాయాలు తెలిపాయని చెప్పారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు కూడా మిగులు లేదని అంటున్నాయని, ఈ విషయంలో పది రాష్ట్రాల అభిప్రాయాల కోసం సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని తెలిపారు.
కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లో ఉన్న నీటి లోటును తీర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పది లక్షల హెక్టార్లకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని, 87000 కోట్ల అంచనా వ్యయంతో ఈ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, వివరాలను నెల రోజుల్లోపు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.
ఈ అభిప్రాయ సేకరణ తర్వాత ఆ తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘం ద్వారా ఖచ్చితమైన అధ్యయనం జరగాలని తెలంగాణ కోరగా.. తమ వాటాకు భంగం కలగకుండా చూడాలని ఏపీ డిమాండ్ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

