భర్తకు పదేండ్ల శిక్ష, జరిమానా

వెంగళరావునగర్, సెప్టెంబర్ 18: కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించి.. ఆమె బలవన్మరణానికి కారణమైన భర్తకు పదేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ.. శనివారం 4వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్‌కుమార్ తీర్పు చెప్పారు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేందర్‌నగర్ సమీపంలోని చింతల్‌మెట్‌కు చెందిన నస్రీన్ బేగంకు బోరబండలోని హెచ్ఎఫ్నగర్కు చెందిన ఎండీ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ వాహీద్(36)తో 2012 డిసెంబర్లో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఇమ్రాన్ ఖాన్, అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అదనంగా కట్నం తీసుకురావాలంటూ.. నస్రీన్ బేగంను వేధించడం మొదలు పెట్టారు. భరించలేక ఆమె 2015 డిసెంబర్ 19న ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం శనివారం నిందితుడు ఇమ్రాన్ ఖాన్‌కు జైలు, జరిమానా విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Jail
- jail sentence
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

