Hyderabad | హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?
Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్‌లోనూ భారీ వర్షం కురుస్తుండటంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ రద్దయితే ఎలా?
ఇవాల్టి మ్యాచ్ రద్దయినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఫిక్సవుతుంది. అదే వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దయితే గుజరాత్, హైదరాబాద్ జట్లకు చెరో రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే అప్పుడు 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినట్లే అవుతుంది. ఇక పంజాబ్‌తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే టాప్-2కి వెళ్లే ఛాన్స్ ఉంది.
Uppal Stadium Battles Heavy rain:(#SRHvsGT pic.twitter.com/qEp0BoJAYh
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 16, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
AP SEC | పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు : ఏపీ ఎస్ఈసీ
‘కొత్తగూడెం ఇంటి పట్టాల పంపిణీ అవినీతిపై ఎమ్మెల్యే స్పందించాలి’
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

