Indian Racing League | సాగర తీరంలో మళ్లీ కార్ రేసింగ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్ రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
- నగరంలో ఇండియన్ రేసింగ్ లీగ్
- నవంబర్ 4,5న నిర్వహణకు ఏర్పాట్లు
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్ రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లు స్పోర్ట్స్ చానెల్స్‌లో రేసింగ్ పోటీలు తిలకించి సంబురపడిపోయిన నగరవాసులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం మళ్లీ నగరవాసులకు వచ్చింది. గతేడాది నవంబర్‌లో మొట్ట మొదటిసారిగా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు హుస్సేన్‌సాగర్ తీరం కేంద్రంగా జరిగాయి. మళ్లీ రెండోసారి అదే ట్రాక్‌పై పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పనులను చేపట్టారు. ఇదే ట్రాక్‌పై ఫార్ములా-ఈ పోటీలు సైతం విజయవంతంగా నిర్వహించడంతో కార్ల రేసింగ్ పరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ఎంతో పేరు వచ్చింది.
అంతర్జాతీయ స్థాయిలో కనిపించే రేస్ కార్లు హుస్సేన్ సాగర్ తీరంలో మళ్లీ రయ్..రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ డ్రైవర్ల రేసింగ్ విన్యాసాలు కనువిందును చేయనున్నాయి. అత్యంత వేగంగా దూసుకువచ్చే కార్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు 2.8కి.మీ పొడవునా ఉన్న ట్రాక్ చుట్టూ ప్రీకాస్ట్ డివైర్లు, వాటిపై ఎత్తయిన ఇనుప కంచెతో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది నిర్వహించినపుడు ట్రాక్ చుట్టూ ఉన్న పరిస్థితులు నేడు విభిన్నంగా ఉన్నాయి. కొత్తగా సచివాలయం, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్, అమరవీరుల స్మారక స్థూపం వంటివి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతమంతా సరికొత్త శోభను తీసుకువచ్చింది. తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగే కార్ రేసింగ్ పోటీలతో ఈ ప్రాంతం మరింత హైలెట్‌గా నిలవనుంది.
హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్…
నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో కార్ల రేసింగ్ కోసం తీర్చిదిద్దిన ట్రాక్‌కు హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్‌గా పిలుస్తున్నారు. దీనిపై గత ఏడాది నవంబర్‌లో, అదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి ఫార్ములా-ఈ పోటీలు జరిగాయి. తాజాగా మరోసారి ఈ రెండు పోటీల షెడ్యూలును నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగానే కార్ రేసింగ్ మార్గాన్ని మళ్లీ సిద్ధం చేస్తున్నారు. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రారంభమై సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ ఘాట్ వెనక వైపు నుంచి-ఐమాక్స్-ఇందిరా గాంధీ రోటరీ నుంచి తిరిగి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా, లుంబినీ పార్క్‌వైపు మళ్లుతుంది. అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను చేరుకుంటుంది. ఈ మార్గం పొడవునా 17 చోట్ల మలుపులు ఉన్నాయి. ఈ రేసింగ్ మార్గంలో పలు ప్రాంతాల్లో మార్షల్ పొజిషన్, ఫైర్పోస్ట్, ట్రాక్ సిగ్నల్ లైట్స్ ఉంటుంది. మరో మూడు చోట్ల సేఫ్టీ కార్లు, రికవరీ, ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

