IICT | సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఆల్గే బయోటెక్నాలజీపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. వాణిజ్యపరంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పర్యావరణహితమైన ఆల్గే ఉత్పత్తులను ప్రోత్సహించడం, సుస్థిర పర్యావరణ విధానాలను అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోంది.
ఈ క్రమంలో ఐఐసీటీ పరిశోధకులు నివేదిత సాహూ, డా. ఎస్ శ్రీధర్ బృందం చేసిన అధ్యయనాలను టైలర్, ఫ్రాన్సిస్ పబ్లికేషన్ మ్యాగజిన్ ప్రచురించింది. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలను విస్తృతం చేయడంలో తమ అధ్యయనాలు సాయపడుతాయని ఐఐసీటీ వర్గాలు పేర్కొన్నాయి.