మన్సూరాబాద్, నవంబర్ 13: మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి శివగంగాకాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గసభ్యులు ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గసభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కాలనీలో నెలకొన్న యూజీడీ, రోడ్ల సమస్యను ఎమ్మెల్యేకు కాలనీవాసులు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. దశలవారీగా కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. శివగంగాకాలనీలో యూజీడీ, రోడ్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు తొంట బాబు, ఉపాధ్యక్షులు దుర్గం నరసింహ యాదవ్, నకరికంటి వెంకటేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి చప్పిడి సతీశ్‌రెడ్డి, సహాయ కార్యదర్శి గుండు భాస్కర్, కోశాధికారి మారగోని లింగస్వామి, ప్రచార కార్యదర్శులు గిరి శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కార్తిక వనభోజనాలు
కార్తిక వనభోజనాలు ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటి చెబుతాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. కామినేని చౌరస్తా సమీపంలోని స్వకుళసాళి భవనంలో ఆదివారం మన్సూరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 9వ కార్తిక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. కులస్తులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ రాజకీయంగా మరింతగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు గంజి సత్తయ్య, అధ్యక్షుడు గంజి వెంకటేశం, ముఖ్య ఉపాధ్యక్షుడు రుద్ర లక్ష్మీనరసింహ, ప్రధాన కార్యదర్శి గజం సత్యనారాయణ, కోశాధికారి గుర్రం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీత వెంకటేశం, జెల్ల కోటిలింగం, చిక్కా భారతమ్మ, కార్యదర్శులు గంజి సాంబమూర్తి, వనం సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.