హైదరాబాద్‌లో 125 శాతం అత్యధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జులై నెలలో భారీ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. జులై నెలలో 144.2 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. సాధారణ వర్షపాతం 38.1 మి.మీ. మాత్రమే.
ఇక జులై 6 నుంచి 13వ తేదీ మధ్యలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఆ వారం రోజుల్లో 314 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 511.0 మి.మీ. వర్షం కురిసింది. ఈ సీజన్లో ఆగస్టు 2 వరకు 218.6 మి.మీ. వర్షపాతం అధికంగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 1011.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం కేవలం 252.6 మి.మీ. మాత్రమే. ఇక మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

