Prasads IMAX | ప్రసాద్స్ మల్టిప్లెక్స్ ఇక నుంచి ఐమాక్స్ కాదు.. ఎందుకంటే?
ప్రసాద్స్ మల్టిప్లెక్స్ ఇక నుంచి ఐమాక్స్ కాదు | ప్రసాద్స్ మల్టిప్లెక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఐమాక్స్. ఇప్పటికీ ఐమాక్స్ అంటే చాలు.. అందరి చూపు నెక్లెస్ రోడ్లో ఉన్న ప్రసాద్స్ మల్టిప్లెక్స్ వైపే మళ్లుతుంది.
Prasads IMAX | హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి మల్టిప్లెక్స్ ప్రసాద్స్ ఐమాక్స్. అప్పట్లో థియేటర్లే తప్పితే.. ఇలా మల్టిప్లెక్స్‌లు లేవు. తొలిసారి ప్రసాద్స్ ఐమాక్స్‌ను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మల్టిప్లెక్స్‌ల హడావుడి మొదలైంది. ప్రసాద్స్ మల్టిప్లెక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఐమాక్స్. ఇప్పటికీ ఐమాక్స్ అంటే చాలు.. అందరి చూపు నెక్లెస్ రోడ్లో ఉన్న ప్రసాద్స్ మల్టిప్లెక్స్ వైపే మళ్లుతుంది.

అయితే.. ఇక నుంచి దాన్ని ఐమాక్స్ అని పిలవలేం. ప్రసాద్స్ మల్టిప్లెక్స్ అనే పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ మల్టిప్లెక్స్‌లో ఇక ఐమాక్స్ ఫార్మాట్లో సినిమాలను ప్రదర్శించరు కాబట్టి. అవును.. ఐమాక్స్ ఫార్మాట్లో అతిపెద్ద స్క్రీన్ మీద సినిమాలను మొట్టమొదటి ఐమాక్స్ స్క్రీన్ ప్రసాద్స్ మల్టిప్లెక్సే. కానీ.. ఇక నుంచి అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ ఉండదు. దానికి కారణం డిజిటలైజేషన్.
ఐమాక్స్ అనలాగ్ ప్రొజెక్టర్ ద్వారా ఇదివరకు ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ఐమాక్స్ ప్రింట్(రీల్)ను ప్రొజెక్ట్ చేసి సినిమాను ప్రదర్శించేవారు.
కానీ.. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ వచ్చేసింది. ఇదివరకులా రీల్స్ లేవు. సినిమాలను తీయడం కూడా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుండటంతో సినిమాలను రిలీజ్ చేసే ఫార్మాట్ కూడా డిజిటల్ అయిపోయింది. డిజిటల్ ద్వారా కూడా ఐమాక్స్ అనుభవాన్ని ఎలా పొందాలో ఫిలింమేకర్స్కు కూడా తెలిసింది. దాని కోసం డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్లో కొందరు ఫిలిం మేకర్స్ సినిమాలు తీస్తున్నప్పటికీ.. ప్రసాద్స్ మల్టిప్లెక్స్‌లో మాత్రం ఐమాక్స్ స్క్రీన్ మీద సినిమాలు ఇక చూడలేం.
ఎందుకంటే.. ఐమాక్స్ స్క్రీనింగ్‌ను ఇప్పుడు ప్రసాద్ మల్టిప్లెక్స్ సపోర్ట్ చేయడం లేదు.
అయినప్పటికీ.. ప్రస్తుతం ప్రసాద్స్ మల్టిప్లెక్స్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఐమాక్స్ స్క్రీన్ లేకున్నా.. ఇతర లార్జ్ స్క్రీన్ల మీద లేటెస్ట్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో సినిమా లవర్స్ ప్రసాద్స్ మల్టిప్లెక్స్‌కు క్యూ కడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Drink Chai And Eat Cup | చాయ్ తాగి అదే కప్పును తినేయొచ్చు.. హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయత్నం
Special Christmas Tree | ముత్యాలతో “క్రిస్మస్ ట్రీ”ని రూపొందించిన ర్యాడిసన్ హైదరాబాద్
ఉచిత మంచినీటి పథకం.. జీరో వాటర్ బిల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

