మాస్కు ధరించని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి జరిమానా
తీగల కృష్ణారెడ్డి | మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తన కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. మాస్కు ధరించని తీగల కృష్ణారెడ్డికి సబ్ ఇన్స్పెక్టర్

హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కు ధరించాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కోడై కూస్తున్న కొంతమందికి అసలు చెవిన పట్టడం లేదు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
సరూర్‌నగర్ పోలీసులు కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద మంగళవారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధరించని వారికి పోలీసులు జరిమానా విధించారు. ఇదే సమయంలో మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తన కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. మాస్కు ధరించని తీగల కృష్ణారెడ్డికి సబ్ ఇన్స్పెక్టర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో తీగల కృష్ణారెడ్డి, ముఖేష్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్లినా కూడా మాస్కు ధరించాల్సిందేనని తీగలకు ఎస్ఐ తేల్చిచెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

