Hyderabad Police | అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా ఉండి, భయంతో పోలీసులను సాయం అడిగితే ఇంటి దగ్గర దింపాలని రూల్ ఉందా? లేదా? చెప్పండి అంటూ విజయవాడకు చెందిన ఓ యువతి ప్రశ్నించిన వీడియో ఇటీవల సోషల్మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై చందానగర్ పోలీసులు వివరణ ఇచ్చారు. తాము క్యాబ్ బుక్ చేసి పంపిస్తామని చెప్పామని.. కానీ ఆమెనే వినిపించుకోలేదని స్పష్టం చేశారు.
గురువారం అర్ధరాత్రి సమయంలో యువతి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసిందని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద దింపాలని అడిగిందని చందానగర్ ఎస్హెచ్వో తెలిపారు. అయితే తమకు అత్యవసర సేవలు ఉంటాయి కాబట్టి, క్యాబ్ బుక్ చేసి పంపిస్తామని చెప్పామని వివరణ ఇచ్చారు. మీరు దింపితే రండి లేకపోతే లేదు అంటూ యువతి ర్యాపిడోలో వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
‘ జూన్ 6వ తేదీ గురువారం లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. రాత్రి 11.30 గంటలోపు ఆ రైలు లింగంపల్లికి రావాలి. కానీ ఆ రైలులో సమస్య కారణంగా బీబీ నగర్లో రెండు గంటల పాటు ఆపేశారు. దీంతో రైలు లింగంపల్లికి వచ్చే సరికి 1.45 అయ్యింది. ఆ సమయంలో ర్యాపిడో బుక్ చేసుకోవడానికి భయం వేసింది. ఆ రోడ్డు మొత్తం ఫారెస్ట్లా ఉండటంతో నాకు భయమేసి, ఎవరికి కాల్ చేయాలో అర్థంకాక పోలీసులకు కాల్ చేశాను. హెల్ప్ చేయమని అడిగాను. కానీ వాళ్ల నుంచి వచ్చిన రియాక్షన్కు షాకయ్యాను. అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు’ అని చెప్పి ఆ వీడియోలో యువతి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఆ సమయంలో పోలీసులకే ఎందుకు ఫోన్ చేయాలని అనిపించిందో కూడా యువతి వివరించారు. ‘ అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా ఫీలయితే పోలీసులకు కాల్ చేయవచ్చని, అప్పుడు పోలీసులు వచ్చి డ్రాప్ చేస్తారని ఆ మధ్య ఒక ప్రచారం చూశా. కానీ నాకు ఎప్పుడూ ఆ సమస్య రాలేదు. నిన్న అవసరం వచ్చింది కాబట్టి అది గుర్తొచ్చి పోలీసులకు ఫోన్ చేశా. కానీ వారి దగ్గర నుంచి అలాంటి రియాక్షన్ రావడంతో నిజంగా బాధేసింది.’ అని తెలిపింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయమేంటంటే.. ఆ సర్క్యూలేట్ మిస్టేకా? నేనే పొరపాటు పడ్డానా? పోలీసులే ఇగ్నోర్ చేశారా చెప్పండి అని సోషల్మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో స్పందించిన చందానగర్ పోలీసులు.. అసలేం జరిగిందో వివరించారు.
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం
తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి
అయితే నిన్ను ఇంట్లో దింపాలని ఎక్కడా రూల్ లేదని పోలీసుల… pic.twitter.com/fs0vjvZSs1
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2026