పోలీస్ కొలువు..పోరాడి గెలువు
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కొలువులను బర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది.
- బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో వందలాది మంది కఠోర సాధన
- రాత పరీక్షలో నెగ్గి..ఈవెంట్స్‌కు సన్నద్ధం
- ఉదయం 5 నుంచి 10 గంటల వరకు ప్రాక్టీస్
- సాధనలో గర్భిణులు సైతం
- పిల్లలను వెంటేసుకొని భార్యాభర్తలు కూడా..
- ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు
- వారికి గుడ్లు, పాలు, పండ్లు ఇవ్వాలి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, డిసెంబర్ 12;మంచు కురుస్తున్నా.. చలి చంపేస్తున్నా వెనుకడుగు వేసేది లేదంటున్నారు. లక్ష్యసాధనలో ఎన్నిఅవాంతరాలు ఎదురైనా లెక్క చేయడం లేదు ఈవెంట్స్‌కు ఎంపికైన మహిళా పోలీస్ ఉద్యోగార్థులు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని మున్సిపల్ గ్రౌండ్లో ప్రతిరోజు సుమారు 250-300 మంది ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో కొందరు గర్భిణులు, మరికొందరు మహిళలు తమ పిల్లలను సైతం మైదానానికి తీసుకొస్తున్నారు. వారితో కలిసి
కఠోర సాధన చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కొలువులను బర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది. రాత పరీక్షలు సైతం నిర్వహించింది. ప్రస్తుతం పోలీ సు ఉద్యోగం కోసం రాత పరీక్షల్లో అర్హత సాధించిన సుమారు 250 నుంచి 300 వరకు మహిళలు, పురుషులు ఈవెంట్స్‌లో అర్హత సాధించడానికి బడంగ్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సాధన చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పురుషులతో సమానంగా గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు.
పిల్లలు సైతం వారివెంటనే..!
ప్రాక్టీస్ కోసం వస్తున్న కొంతమంది భార్యాభర్తలు వారి పిల్లలను సైతం వారివెంటనే గ్రౌండ్‌కు తీసుకువస్తున్నారు. గ్రౌండ్ నుంచే నేరుగా స్కూల్‌కు పంపిస్తున్నారు. మరికొందరు భర్త ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భార్య పిల్లలను ఎత్తుకుంటుండగా.. భార్య ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భర్త పిల్లలను ఆటలు ఆడిస్తూ కనిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ పిల్లలతో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గర్భిణులు సైతం పోలీసు కొలువు కోసం సాధన చేస్తున్నారు. కోచ్‌లు క్రమం తప్పకుండా మెళకువలు నేర్పిస్తున్నారు. అయితే మహిళలకు ప్రతి రోజు గుడ్లు, పాలు, పండ్లు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఈ వెంట్స్ కోసం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు సాధన చేస్తున్నారు. 300 మందికి పైచిలుకు గ్రౌండ్‌కు వస్తున్నారు. కొంత మంది గర్భిణులు కూడా పోలీస్ ఉద్యోగం సాధించడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరికీ ఉచితంగానే శిక్షణ ఇస్తున్నాం.
– ఎనుముల కొండల్ రెడ్డి, కోచ్
పిల్లలతో పాటు వస్తున్నాం..!
ఉదయం ఐదు గంటలకే గ్రౌండ్‌కు వస్తున్నాం. ఇద్దరం ప్రాక్టీస్ చేస్తుండటంతో మా పిల్లలను సైతం మాతోనే తీసుకువస్తున్నాం. ఉదయం 9 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. రెండు నెలలు కష్టపడితే జీవితంలో స్థిర పడుతామనే నమ్మకం ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– మనీష, కర్మన్ఘట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

