Hyderabad Metro | నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో సమయం పొడిగించారు. అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. గంట లోపు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.