గోల్నాక, ఫిబ్రవరి 26 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, వై. అమృత తదితరులతో కలసి 127 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ.1, 27, 14,000 విలువగల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…పేదింటి ఆడపడుచుల పెండ్లిండ్లకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారాడన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు అశ్విన్, బీవీ.మహేష్రాజు, బద్రినాథ్, రాముతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక సమస్యలు పరిష్కరిస్తా..
తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం అంబర్పేట డివిజన్ ఇందిరానగర్ బస్తీ వాసులు స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బస్తీలో శిథిలావస్థకు చేరిన కరెంటు స్తంభాలు, పాడైన రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించాలని బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఇందిరానగర్ బస్తీవాసులు బాలకృష్ణ, చంద్రశేఖర్, నవీన్, చక్రపాణి, వంశీ, రాజు, నరసింహ, టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ముదిరాజ్, అమనూరి సతీశ్, సంతోష్చారి తదితరులు ఉన్నారు.