ఉప్పల్, అక్టోబర్ 13 : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా మునుగోడుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ లక్కారం వద్ద ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి, బొకేలు అందించి, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యక్రమానికి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, కాసం మహిపాల్‌రెడ్డి, వేముల సంతోశ్‌రెడ్డి, సుడుగు మహేందర్‌రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగ్‌రావు, డాక్టర్ బీవీ.చారి పాల్గొన్నారు.