నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/మారేడుపల్లి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేసిన కేసులో దక్కన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ భాస్కర్‌కు నాంపల్లి 11వ సెషన్ కోర్టు 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 11వ సెషన్ కోర్టు పీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో డెక్కన్ హాస్పిటల్‌కి ఊపిరితిత్తుల సమ స్య ఉందని చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళ పట్ల పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ భాస్కర్ అసభ్యంగా, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని సదరు మహిళ రామ్‌గోపాల్ పురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయభాస్కర్‌పై 342/2016 కింద చార్జ్ షీట్‌ని కోర్టులో ఫైల్ చేశారు. ఆ కేసు (569/2017)లో విచారణ పూర్తిచేసిన 11వ సెషన్ జడ్జి జె.కవిత నేరం రుజువైందని 376(2)(e)354 ఐపీసీ ప్రకారం 13 ఏండ్ల జైలు శిక్ష , రూ.5వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. అలాగే నిందితుడు కేసును అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది.