Hyderabad | ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు అరెస్టు
Hyderabad | ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడులు, ఆన్లైన్ గేమ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటికి పైగా నగదు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Hyderabad | ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడులు, ఆన్లైన్ గేమ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటికి పైగా నగదు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
సైబర్ క్రైమ్ విభాగం రెండు కీలకమైన కేసులను చేధించిందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డఫాబెట్ వెబ్సైట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి నిందితులు మోసాలు చేస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్తి డఫాబెట్‌లో రూ. 70లక్షలు పెట్టి ఆన్లైన్ గేమ్ ఆడారని.. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేశారని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. హరియాణాకు చెందిన హితేశ్ గోయల్ మోసాల్ చేశాడని.. నిందితుణ్ని ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు . నిందితుడి నుంచి రూ.1.40 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపారు.
యూనిటీ స్టాక్స్ పేరుతో ఆన్లైన్ మోసాలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు రూ3.16 కోట్లు నష్టపోయానని ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు. నిందితుడు రోనక్ తన్నాను అరెస్టు చేశారని తెలిపారు. రోనక్ తన్నా దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. నిందితుల బ్యాంక్ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారని అన్నారు. నిందితుడు 95 బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడి యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్‌కు అలవాటుపడి అఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన అఖిల్ బిగ్మి ఆటకు అలవాటు పడిన అఖిల్ ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ తల్లి జయ ఫిర్యాదుతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

