Hyderabad CP | హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టింగ్‌ల కోసం సిఫారసు లేఖలతో వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టాలెంట్ ఉన్నవారికే ప్రమోషన్లు ఇస్తామన్నారు. సిఫారసు లేఖలతో వచ్చేవారికి పోస్టింగ్‌లు ఉండవని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు. లేఖలు పట్టుకుని వస్తే ఏసీఆర్‌లో పేర్లు నమోదు చేస్తాం. ఒక్కసారి పేరు నమోదు చేస్తే ప్రమోషన్లు ఉండవు అని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.