Fire in Car | సచివాలయానికి సమీపంలో కారు దగ్ధం.. ట్రాఫిక్ జామ్.. Video
Fire in Car | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారు మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో బ్యానెట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు.
Fire in Car | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారు మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో బ్యానెట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే ఆపి బయటకు దిగారు. కారులోని విలువైన వస్తువులను సైతం బయటకు తీసుకువచ్చారు. మెయిన్రోడ్డులో ప్రమాదం జరుగడంతో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గురైన స్విఫ్ట్ డిజైర్ కారు సెక్రటేరియట్లోని ఉద్యోగిదిగా సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు తెలుస్తున్నది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

