Hyderabad | ఉస్మానియా ఆస్పత్రిలో కంప్యూటర్లు, ఏసీ చోరీ
Hyderabad | నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోని కంప్యూటర్లు, ఏసీని దొంగలు అపహరించారు. అఫ్జల్ గంజ్ పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోకి

హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోని కంప్యూటర్లు, ఏసీని దొంగలు అపహరించారు. అఫ్జల్ గంజ్ పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న రెండు కంప్యూటర్లను, ప్రింటర్, ప్రొజెక్టర్, ఏసీతో పాటు ఇతర వస్తువులను దొంగిలించారు. అయితే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ రూమ్ డోర్ సరిగా లేదు. దీంతో ఆ డోర్ నుంచే దొంగలు లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థోపెడిక్ విభాగం ఓల్డ్ బ్లాక్‌లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అయితే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాలు కానీ లేవని పోలీసుల విచారణలో వెల్లడైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

