కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 9 : పరిసరాల పరిశుభ్రత.. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వారం రోజులుగా కాలనీలు, బస్తీలలో వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తున్నారు. నాలాలలో పూడికతీతతో పాటు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తున్నారు. అణువైన ఖాళీ స్థలాలున్నచోట మొక్కలు నాటుతూ సంరక్షించే పనులను చేస్తున్నారు.
మరోవైపు పార్కులు, పబ్లిక్ ప్లేస్‌లు, పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా మారుస్తున్నారు. గడువులోగా కాలనీలు, బస్తీలన్నింటిలో వందశాతం స్వచ్ఛతను సాధించే దిశగా పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటి వరకు 401 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారం, 3487 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు, 208 కి.మీల దూరం నాలాలలో వ్యర్థాల తొలగింపు, 21.54 కి.మీల దూరం నాలాలలో పూడికతీత పనులు, 57 పార్కులు, 28 శ్మశానవాటికలలో పరిసరాలను పరిశుభ్రంగా మార్చే పనులను చేపట్టారు. అదే విధంగా దోమల నియంత్రణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో అందుబాటులో ఉన్న స్థలాలలో మొక్కలు నాటుతూ సంరక్షించే పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే యాభై శాతం పనులు పూర్తయ్యాయని.. ఈనెల 18లోగా వందశాతం పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం విజ్ఞాన్‌పురి కాలనీలో పట్టణ ప్రగతిని కార్పొరేటర్ పరిశీలించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రామారావు, రాంచందర్‌రాజు, కృష్ణారెడ్డి, కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి ప్రభాకర్, మహేశ్, నాగరాజు, వెంకటేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.
హైదర్‌నగర్‌లోని నందమూరినగర్, జయభారత్నగర్లలో పట్టణ ప్రగతిని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి సాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, ప్రశాంతి, హైదర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు పోతుల రాజేందర్, స్థానిక నేతలు షరీఫ్, ఖదీర్, అష్రఫ్, శ్రీనివాస్, సిద్దం శ్రీకాంత్, ఫసీయుద్దీన్, బాలయ్య, సురేశ్, శివరామ్‌ప్రసాద్, కుమారస్వామి, సాంబశివరావు ఉన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 9 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అన్నారు. గురువారం వివేకనందనగర్లోని మాధవరం కాలనీలో పట్టణ ప్రగతిని ఆమె పరిశీలించారు. ప్రజలు సహకరిస్తేనే సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు సుజల, ప్రియాంక, పద్మ, మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, రమణారెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.
బాలానగర్, జూన్ 9 : ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో పట్టణ ప్రగతి కార్యాక్రమం అట్టహాసంగా జరగుతున్నది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులందరూ కలిసి పార్టీ అదిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పని చేస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముదకదం నర్సింహయాదవ్ల సూచన మేరకు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గురువారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్పార్క్, ఆనంద్‌నగర్ కాలనీలలో కట్ చేసిన చెట్టు కొమ్మలను వారు తొలగింపజేశారు. అనంతరం చీపుర్లతో రోడ్లను ఊడ్చారు. కార్యక్రమంలో ఏఈ అరవింద్, నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, బల్వంత్‌రెడ్డి, ఇర్ఫాన్, మేకల హరినాథ్, వినోద్, జహంగీర్, పిట్ల రాజు ముదిరాజ్, యాదగిరి, ఆబిద్, ఉదయ్, కనకదాస్, నవీన్‌కుమార్, ఓంప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 9 : ఆల్విన్ కాలనీ డివిజన్లోని రాఘవేంద్రనగర్, కాకతీయనగర్, చక్రధారీనగర్లలో పట్టణ ప్రగతిని కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ పరిశీలించారు. కాలనీలు, బస్తీలలో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా మార్చాలని.. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాల సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సీ, ఏఈలు సుభాష్, స్వప్న, డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, రాజేశ్చంద్ర, శ్రీనివాస్, శౌకత్‌అలీ, స్వరూపారాణి, రాములుగౌడ్, సాయిగౌడ్, వంశీగౌడ్, పోశెట్టి గౌడ్ తదితరులున్నారు.