హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాల్లో వెళ్లొద్దని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిల్మ్ నగర్, పూరి జగన్నాథ ఆలయం, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఒరిస్సా ఐలాండ్, ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్కు, రోడ్ నంబర్ 45 జంక్షన్ మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు. ఈ మార్గాల్లో వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.