సమస్యల వలయంలో ఉప్పల్ భగాయత్
మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విఫలమైంది.
- మురికి కూపంలా, డంపింగ్ యార్డులుగా మారిన రోడ్లు
- విజృంభిస్తున్న దోమలు, భద్రత పరంగానూ సమస్యలు
- శాఖల మధ్య సమన్వయ లోపమే కారణం
- హెచ్ఎండీఏ-జీహెచ్ఎంసీ అధికారులు
- నిర్లక్ష్యం వీడాలని స్థానికుల వేడుకోలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విఫలమైంది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రోస్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును అభివృద్ధి చేశారు. నివాసాలకు అత్యంత అనువుగా ఉండడంతో పెద్ద ఎత్తున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంతో పాటు అపార్టుమెంట్లు, భారీ బహుళ అంతస్థుల భవనాలు ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో భారీ సంఖ్యలోనే పూర్తి చేసుకోగా, మరిన్ని పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నా దానికి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. దీంతో ఎంతో విశాలమైన రోడ్లతో కనిపించే ఉప్పల్ భగాయత్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో పాటు పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్ దర్శనమిస్తున్నాయి. లేఅవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసినా, ఈ ప్రాంత పరిధి జీహెచ్ఎంసీలోకి రావడంతో ఇక్కడ మౌలిక వసతుల కల్పన విషయంలో రెండు ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లక్షల్లో లాగినా.. సమస్యలు తీరట్లే!
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్రస్తుతం వందలాది మంది ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. అదేవిధంగా కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారు భవన నిర్మాణాల అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంటే లక్షల్లోనే ఫీజులు చెల్లిస్తున్నారు. ఇలా రెండు విధాలుగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా మౌలిక వసతుల కల్పనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉప్పల్ భగాయత్‌లో పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల విషయాలను గాలికి వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి చెత్తాచెదారం కనిపిస్తున్నది. ఉప్పల్ భగాయత్‌లో పలు చోట్ల మురుగునీరు గుంతల్లో నిండిపోయి దుర్వాసనకు తోడు దోమలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వీటికి తోడు భద్రత పరంగానూ పోలీసు శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణం
మౌలిక వసతుల లేమికి తోడు కొందరు ఇష్టారాజ్యంగా ఖాళీ స్థలాల్లో అనుమతులు లేకుండా షెడ్లు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాలమైన రోడ్ల వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌లను సైతం అక్రమించి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయమై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

