Traffic Jam | పంజాగుట్ట వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
హైదరాబాద్: హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. అమీర్పేట నుంచి ఖైరతాబాద్ వైపు పురుగుల మందు లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. లారీలో ఉన్న పురుగుల మందు కాటన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

