Amberpet Flyover | అంబర్పేట్ ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని ఫ్లైఓవర్ (Amberpet Flyover) వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని ఫ్లైఓవర్ (Amberpet Flyover) వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకున్నది. దీంతో స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నల్లటి పొగ కమ్ముకోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
అంబర్‌పేట నూతన ఫ్లైఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. వరంగల్ జాతీయ రహదారిపై ఏడేండ్ల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. పనులు నిదానంగా సాగడంతో ఇన్నిరోజులు వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే శివరాత్రి నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాలను అనుమతిస్తుండటంతో ఏండ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

