సిటీబ్యూరో, నవంబరు 5(నమస్తే తెలంగాణ): అనధికారికంగా ఏర్పరచుకు న్న నల్లా కనెక్షన్లపై అధికారుల ఏరివేత కొ నసాగుతున్నది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-12లోని జగద్గిరిగుట్ట సెక్షన్ పరిధిలోని శివనగర్‌లో నివసించే వి.రాజశేఖ ర్ అనే వ్యక్తి తన నివాసానికి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. ఈ విషయా న్ని గుర్తించిన జల మండలి విజిలెన్స్ విభా గం అక్రమ కనెక్షన్‌ను తొలగించింది. అక్ర మ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న వి.రాజశేఖర్‌పై జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో యు/ఎస్ 430 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
సమాచారమివ్వండి..
వివరాలు గోప్యంగా ఉంచుతాం: విజిలెన్స్
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జల మండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్ర మంగా నల్లా కనెక్షన్లు తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్‌కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిసున్నా వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 99899 98100, 99899 92268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.