Hyderabad | మోకిలలో గజం రూ. లక్ష.. హెచ్ఎండీఏ లేఅవుట్ వేలానికి అనూహ్య స్పందన
Hyderabad |మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది.
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయానికి ఉంచింది. తొలి రోజు ఉదయం 30 ప్లాట్లను, మధ్యా హ్నం మరో 30 ప్లాట్లను వేలానికి పెట్టగా కొనుగోలుదారులు 58 ప్లాట్లను సొంతం చేసుకున్నారు.
దీంతో హెచ్ఎండీఏకి మొదటి రోజే రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది. గజం ధర గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.54 వేలు పలకడంతో సగటు ధర రూ. 63,512గా నమోదైనట్టు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసే లేఅవుట్లలో మౌలిక సదుపాయలు అద్భుతంగా ఉంటాయన్న విశ్వాసంతోపాటు వివాదరహితమైన ఆయా ప్లాట్లలో ఇండ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయన్న నమ్మకమే ఇందుకు కారణం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hmda
- Hyderabad
- Mokila
- Mokila Layout
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

