Shamshabad | ఇద్దరు ముగ్గురికి మించి రావద్దని చెప్పినా.. ఒక్కరికి వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న 10 నుంచి 15 మంది
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో వారికి వీడ్కోలు చెప్పేందుకు వందలాది మంది విమానాశ్రయానికి వస్తున్నారు.
- శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పెరిగిన రద్దీ
- ఒక్కరి వీడ్కోలుకు 10 నుంచి 15 మంది..
- టెర్మినళ్ల వద్ద పెరుగుతున్న ట్రాఫికర్
- నలుగురికి మించి రావద్దని పోలీసుల సూచన
- వీడ్కోలు పలికేందుకు నలుగురికి మించి రావొద్దని పోలీసుల సూచన
Shamshabad | సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో వారికి వీడ్కోలు చెప్పేందుకు వందలాది మంది విమానాశ్రయానికి వస్తున్నారు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో కొంత మంది ప్రయాణికులు సమయానికి బోర్డింగ్ కాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీడ్కోలు కోసం నలుగురు మాత్రమే రావాలని అధికారులు పేర్కొన్నారు.
విదేశాలకు వెళ్తున్న వారి వెంట ఎక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు రావొద్దని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఒక్క ప్రయాణికుడి కోసం సుమారు 10 నుంచి 15 మంది ఎయిర్‌పోర్టుకు వస్తుండటంతో భద్రతా సమస్యలతో పాటు పార్కింగ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. దీనికి తోడు పంద్రాగస్టు నేపథ్యంలో విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సీఐఎస్ఎఫ్, స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత 3, 4 రోజులుగా ఎయిర్‌పోర్టులో పెరిగిన రద్దీ నేపథ్యంలో పోలీసులు, విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ముందస్తుగా సూచనలు చేశారు. అయినా శనివారం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసింది. నిత్యం విదేశాలకు సుమారు 5వేల మంది విద్యార్థులు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
కారేపల్లిలో నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు
విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

