భారీ వర్షం.. విద్యుత్ వ్యవస్థ ఆగమాగం
గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్‌లపై నుంచి ఫ్లెక్సీలు ఎగిరిపోయి 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లపై పడటంతో చాలా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- అర్ధరాత్రి వరకు పూర్తి కానీ పునరుద్ధరణ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్‌లపై నుంచి ఫ్లెక్సీలు ఎగిరిపోయి 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లపై పడటంతో చాలా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో అవి విరిగిపోయాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్‌నగర్ సర్కిళ్లతో పాటు రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు కరెంటు లేదు. కాగా విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యవేక్షించారు.
గంటలు గడిచినా రాని కరెంటు…
వర్షం నిలిచిన తరువాత నగరంలో ఓ వైపు ట్రాఫిక్, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నది. కొన్ని చోట్ల వర్షం ఆగిపోయి 2 గంటలు గడిచినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని వందలాది మంది ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రేటర్లో విద్యుత్ నెట్వర్క్ చాలా చోట్ల దెబ్బతినడంతోనే పునరుద్ధరణ పనులు ఆలస్యమైనట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షంలోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు ఎక్కి తీగలపై పడిన చెట్ల కొమ్మలు, ఇతర వస్తువులను తొలగించారని తెలిపారు. రాత్రంతా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేశారని విద్యుత్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

