వాషింగ్ టన్ ,మే 7: ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే… మరోపక్క వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను బలవంతం చేయకుండా వారంతంట వాళ్లే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా సూపర్ ఆఫర్ ని సిద్ధం చేసింది బైడెన్ ప్రభుత్వం. కొవిడ్ టీకా తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది.జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకువ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు.
18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.టీకా తీసుకున్న యువతకు బీర్ ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ ‘షాట్ అండ్ ఏ బీర్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ‘మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు’ అని పేర్కొన్నారు. 21ఏండ్లు పైడిన యువత మద్యం సేవించడాన్ని న్యూజెర్సీ రాష్ట్రం చట్టబద్ధం చేసింది. దీంతో ఈ 21ఏండ్లు పైడిన యువత మాత్రమే ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌కు అర్హులు.