సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ ) : జలమండలి ఉద్యోగి కుమారుడు అంతర్జాతీయ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. డివిజన్ -8లో టీజీ-2గా పనిచేస్తున్న పురాన్ సింగ్ కుమారుడు శశాంక్ సింగ్ మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్-2024 పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించాడు. శశాంక్‌ను జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో 27 దేశాల నుంచి పిల్లలు పోటీ పడగా, మన దేశం తరపున శశాంక్ గోల్డ్ మెడల్ సాధించాడు. శశాంక్‌కు ప్రస్తుతం ఎనిదేండ్లు అని, ఐదేండ్ల నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తండ్రి పురాన్ సింగ్ తెలిపారు.