Crime News | మద్యం మత్తులో సైకో వీరంగం
మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్‌కుమార్ జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిస్తున్నాడు.
Crime News | బంజారాహిల్స్, ఏప్రిల్ 12: మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్‌కుమార్ జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిస్తున్నాడు. ఇందిరానగర్ నివాసి సైకో అయిన అల్లూరు శ్రీకాంత్ (30) గురువారం రాత్రి స్టూడియో వద్దకు వచ్చాడు. స్టూడియోలోకి అనుమతించాలని, సూపర్వైజర్ను కలుస్తానంటూ గట్టిగా కేకలు పెడుతూ గేటువద్ద న్యూసెన్స్‌కు పాల్పడ్డాడు. ఈ సమయంలో లోపల ఎవరూ లేరని, ఉదయం పూట రావాలని సెక్యూరిటీ గార్డు అనిల్‌కుమార్‌తోపాటు మరో సెక్యురిటీ గార్డు చెప్పి గేట్లు మూశారు.
దీంతో శ్రీకాంత్ పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకొచ్చి స్టూడియో గేట్లపై విసిరాడు. దీంతో బయటకు వచ్చిన అనిల్‌కుమార్‌ను తీవ్ర పదజాలంతో దూషించిన శ్రీకాంత్.. పెద్ద కర్రతో దాడి చేశాడు. అనిల్‌కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. శుక్రవారం బాధితుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో కూడా పలువురిపై దాడులకు పాల్పడి, అరెస్టయినట్లు విచారణలో తేలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

