ఓటు.. మీ హక్కు
నవంబర్ 2 రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పేలవంగా జరుగుతున్నది. దరఖాస్తుల స్వీకరణకు మరో నాలుగు రోజులు (నవంబర్ 6) మాత్రమే గడువు మిగిలి ఉండటంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
- పట్టభద్రులూ నమోదు చేసుకోండి
- నాలుగు రోజులే గడువు
(నమస్తే తెలంగాణ)- సిటీబ్యూరో, నవంబర్ 2 రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పేలవంగా జరుగుతున్నది. దరఖాస్తుల స్వీకరణకు మరో నాలుగు రోజులు (నవంబర్ 6) మాత్రమే గడువు మిగిలి ఉండటంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ అందిన దరఖాస్తులను వేగంగా పరిశీలించడంలోనూ దారుణంగా విఫలమయ్యారని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఆదివారం నాటి వరకు తొమ్మిది జిల్లాల పరిదిలో 4.11 లక్షల దరఖాస్తులు స్వీకరిస్తే 68,657 మాత్రమే ఆమోదం తెలిపారు. 1672 దరఖాస్తులను తిరస్కరించగా, 3,40, 788 దరఖాస్తులు పెండింగ్లో పెట్టారు.
సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఉన్నత విద్యావంతుల్లో ఒకవైపు తీవ్ర అనాసక్తి.. మరోవైపు వెనువెంటనే వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కలిసి మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. ఓటే మన ఆయుధం అని ఉపన్యాసాలు దంచే పట్టభద్రులు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు సుముఖత చూపకపోగా, అందినకాడికి దరఖాస్తు చేసుకున్న వారి ఫారాలనుపరిశీలించడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కాగా గత 2021 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో 5.31 లక్షలు ఓట్లు నమోదయ్యాయి.
కానీ ఈ సారి ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,05, 847, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 15, 484 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. కొన్ని జిల్లాలలో గతంలో ఉన్న ఓటర్ల సంఖ్యలో కనీసం సగం కూడా నమోదు కాకపోవడం, వచ్చిన కొద్దిపాటి దరఖాస్తుల పరిశీలనను కూడా బీఎల్వోలు, ఆఫీసర్లు మూలన పడేయడంపై అటు పట్టభద్రులు, ఇటు రాజకీయ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. నిబంధనల ప్రకారం డిగ్రీ సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ, బీఎల్ఓలు తగినంత సంఖ్యలో లేకపోవడం, ఉన్న సిబ్బందిపై ఇతర పనిభారం ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సర్వర్ సమస్యలు, సిబ్బంది కొరత నెపంతో అధికారులు రోజులు నెట్టుకొస్తుండటంతో అపె్లై చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు నమోదైందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో శ్రమకోర్చి, గంటల తరబడి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్నా, ఆఫ్ లైన్ ద్వారా అధికారులకు పత్రాలు సమర్పించినా ఎటువంటి ప్రగతి లేకపోవడంపై పట్టభద్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముసాయిదా జాబితా నాటికి పూర్తయ్యేనా?ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ముంచుకొస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తుది గడువు వచ్చే నెల 25న ఉంటుంది. ఈ లోపే వచ్చిన లక్షలాది రఖాస్తులన్నింటినీ స్రూటినీ చేసి, తప్పుడు సర్టిఫికెట్లను పకనపెట్టి నిజమైన పట్టభద్రులకు ఓటు హకు కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించి పూర్తిగా పునఃసిద్ధం (డీనోవో) పద్ధతిలో నూతన ఓటర్ల జాబితాలను రూపొందించాలని సెప్టెంబర్ 28న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ జారీచేసింది. ప్రస్తుత జాబితాలో పేరున్న వ్యక్తులు కూడా తాజాగా సవరించిన ఫారమ్-18 ద్వారా ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది అవసరమైన పత్రాలు/సర్టిఫికెట్లను జతచేసి ఫారమ్-18ను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నియమిత అధికారులు, అదనపు నియమిత అధికారులకు వ్యక్తిగతంగా సమర్పించవచ్చని, దరఖాస్తులను పోస్టు ద్వారా కూడా పంపవచ్చని వెల్లడించింది. మరో 4 రోజుల్లో దరఖాస్తుల గడువు ముగుస్తుండడం, మరో వైపు వెరిఫికేషన్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, ఉన్నతాధికారులు ఇప్పటి వరకు బీఎల్వో, ఈఆర్వోల సమీక్షలు జరపకపోవడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

