11,700 మందికి ఇండ్లు
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన చక్కటి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. ఎవరి జోక్యం లేకుండా.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది.
- రెండో విడతలోనూ పక్కాగా.. పారదర్శకంగా ప్రక్రియ
- పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల కేటాయింపు
- 24 నియోజకవర్గాల నుంచి ర్యాండమైజేషన్లో లబ్ధిదారుల ఎంపిక
- ప్రక్రియలో పాల్గొన్న మంత్రులు తలసాని, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ
- 21న లబ్ధిదారులకు గృహాల పంపిణీ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) :నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన చక్కటి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. ఎవరి జోక్యం లేకుండా.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది. అత్యంత పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఐసీ సహకారంతో ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే పలు రకాల కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు కోసం ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌నే వాడుతున్నారు. రాష్ట్రంలోని ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి కీలక అడ్మిషన్ల కోసం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానమే. అలాంటి ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌ను డబుల్ ఇండ్ల కేటాయింపు కోసం ఉపయోగించడం విశేషం. కాగా, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితారెడ్డి, మహమూద్ అలీ హాజరై ప్రక్రియను ప్రారంభించారు. 24 నియోజకవర్గాల నుంచి ర్యాండమైజేషన్లో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి 21న గృహాలను కేటాయించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి(జీహెచ్ఎంసీ) పరిధిలోని మొత్తం 24 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీల కోటా ప్రకారం ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎన్ఐసీ పోర్టల్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్న ప్రాంతాలు చాలా విలువైనవన్నారు. వందల కోట్లు విలువ చేసే, అద్భుతమైన ప్రాంతాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం సీఎం కేసీఆర్ దార్శనీకతకు నిదర్శనమని కొనియాడారు. ఎన్ఐసీ సాఫ్ట్వేర్ సహకారంతో ఆన్లైన్ లాటరీ పద్ధతిలో, అత్యంత పారదర్శకంగా, ఎవరి జోక్యం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 11,700 లబ్ధిదారులను ఎంపిక చేశారని, ఇందులో దివ్యాంగులకు 470, ఎస్సీలకు 1923, ఎస్టీలకు 655, ఇతరులకు 8652 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 21న ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, గాంధీ, దానం నాగేందర్, ముఠాగోపాల్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణీదేవి, మీర్జా రహమత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో పాటు హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, హైదరాబాద్ ఆర్డీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

