ప్రియా ప్రకాశ్ వారియర్ మలయాళ నటి. ఈమె పేరు తెలియని యూత్ ఉండదు.కనుసైగలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. యూత్ మధిలో హాట్ ఐకాన్గామారింది. సోషల్‌మీడియాను ఒక ఊపు ఊపింది.
ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్. ఈ సినిమాలోని ఓ పాటలో ప్రియా కన్నుగొట్టే సీన్ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఒక్క సీన్‌తో ఈమె పేరు దేశం మొత్తం మారుమోగింది. యూత్‌కు పిచ్చెక్కించింది.
తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టునుఆశ్రయించారు.
మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా సర్వోన్నతన్యాయస్థానాన్ని కోరారు. తన న్యాయవాది ద్వారా 2018 ఫిబ్రవరి 20 సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు.
ప్రియా నటించిన ‘ఒరు అదుర్ లవ్’ సినిమా పాట ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ చిత్ర దర్శకుడిపై హైదరాబాద్‌లో కేసు నమోదైనది. దీనికి సంబంధించి ఆమె తన వ్యాజ్యంలో ఆ పాటపై వివరణ ఇచ్చారు.
1978 నాటి ఓ పాత జానపద గీతం నుంచి పాటను తీసుకున్నామని.. అందులోనిభావాలను అర్ధం చేసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా, వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఫిర్యాదులతో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కలుగుతుందని వ్యాజ్యంలో నివేదించారు.