MLA Rajasingh | మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
MLA Rajasingh | హైదరాబాద్ : మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు. ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు. దుకాణాలను బంద్ చేయించేందుకు పోలీసుల వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి.
మర్డర్లను కంట్రోల్ చేయడానికే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటున్న పోలీసులపై ఒత్తిడి ఎందుకు తెస్తున్నట్లు..? వారి ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు అని రాజాసింగ్ పేర్కొన్నారు.
బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్నగర్, కాలాపత్తర్, కాచిగూడ, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోంది.
మేడ్చల్లో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారు. భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీ చేయొచ్చని ఇంకా చెలరేగిపోతున్నారు. ఇలాంటివి జరగొద్దంటే ముఖ్యమంత్రి భయపడొద్దు.. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని రాజాసింగ్ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

