గోలీసోడా.. కొత్త రుచుల్లో..
భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానియం గోలీసోడా. బస్టాండ్లు, రహదారుల పక్కన బండిలో... ఇలా ఎక్కడైనా గోలీసోడా కనిపిస్తే చాలు.. వెంటనే ఓ గ్లాస్ తాగితే హాయిగా ఉండేది. ఒకప్పుడు భాయ్ ఓ గోలీ సోడా అనగానే బండిపై అమ్మే వ్యక్తి కలరా
రెస్టారెంట్లు, పెద్ద దుకాణాల్లో విక్రయాలు
హయత్నగర్ రూరల్, మే 1: భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానియం గోలీసోడా. బస్టాండ్లు, రహదారుల పక్కన బండిలో… ఇలా ఎక్కడైనా గోలీసోడా కనిపిస్తే చాలు.. వెంటనే ఓ గ్లాస్ తాగితే హాయిగా ఉండేది. ఒకప్పుడు భాయ్ ఓ గోలీ సోడా అనగానే బండిపై అమ్మే వ్యక్తి కలరా, లెమనా అని అడిగి కీస్మనే శబ్దంతో ఒకటి కొట్టి చేతిలో పెట్టేవాడు. ఒకప్పుడు రెండు ఫ్లేవర్లలో మాత్రమే దొరికే ఈ సోడాను రోడ్డు పక్కన, లేదా తోపుడు బండ్లపై పెట్టుకొని అమ్మేవారు. రోడ్డు పక్కనే చిన్న థర్మాకోల్ డబ్బాల్లోనూ ఐస్ ముక్కల మధ్య పెట్టుకుని విక్రయిస్తున్నారు.
ధర ఒక్కటి రూ.40 నుంచి..
ఇప్పుడు గోలీసోడాకు మంచి డిమాండ్ ఉన్నది. కూల్డ్రింక్ షాపులు, పెద్దపెద్ద రెస్టారెంట్లలోనూ గోలీసోడాలను విక్రయిస్తున్నారు. పాత రుచులు ఆస్వాదించాలనుకునే వారు కూల్డ్రింక్లకు బదులు గోలీసోడాల వైపు చూస్తున్నారు. రోడ్డు పక్కన విక్రయిస్తున్న గోలీసోడాలు రూ.15కు ఒక్కటి అమ్ముతున్నారు. అదే సమయంలో రెస్టారెంట్లు, పెద్ద దుకాణాలు, బ్రాండెడ్ టీ షాపుల్లో మాత్రం ఒక్క గోలీసోడా రూ.40 నుంచి రూ. 90 వరకు విక్రయిస్తున్నారు.
విభిన్నమైన ఫ్లేవర్లతో..
పెద్ద దుకాణాల్లో లెమన్, ఆరెంజ్, బ్లూబెర్రీ, మొజిటో, గ్రీన్ యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, రెడ్ గోవా, అమెరికన్ ఐస్క్రీం, పైనాపిల్ గ్రీన్, కివీ, మ్యాంగో, గ్రేప్, మసాలా జీర, సుగంధ, లెమన్ సాల్ట్ తదితర రకాల గోలీసోడాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్లలో బిర్యానీతోపాటు గోలీసోడాలు తీసుకోవడం మరింత పెరిగింది. వివిధ రుచుల్లో లభిస్తుండటంతో భోజనప్రియులు ఆసక్తిచూపుతున్నారు.
మంచి గిరాకీ ఉంది..
మళ్లీ గోలీసోడాలు వచ్చాయా.. అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కూల్డ్రింక్లకు బదులు గోలీసోడాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడే కూర్చుని ఒకప్పటితరం గోలీసోడా గురించి చర్చించుకుంటుండటం చూశా. నేటితరం కూడా సోడాలంటే ఇష్టపడుతున్నారు. సాధారణంగా గోలీ సోడాలో 17 ఫ్లేవర్లు ఉంటాయి. అందులో బ్లూబెర్రీ, ఆరెంజ్, లెమన్, లెమన్ సాల్ట్ ఫ్లేవర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రోజూ 50కిపైగా గోలీసోడాలు అమ్ముతుంటాను. ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటున్నది.
– మహేశ్వర్రెడ్డి, టీహౌస్ నిర్వాహకులు కుంట్లూర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

