గ్రీవెన్స్ ఫిర్యాదులకు మోక్షమేదీ!.. అవస్థలు పడుతున్న వినియోగదారులు
వినియోగదారులు చేసే ఫిర్యాదుల పరిష్కారంలో జలమండలి పూర్తిగా విఫలమవుతున్నది. జలమండలి వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చిన ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ విభాగం జలమండలి సిబ్బందిని, వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
- రోజులు గడుస్తున్నా పరిష్కారం శూన్యం.. జలమండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రీవెన్స్ సెల్లో ఉన్న సాఫ్ట్వేర్ సిస్టంలో లోపాలు వినియోగదారుల పాలిట శాపంగా మారుతున్నది. సాంకేతికంగా తలెత్తుతున్న ఇబ్బందుల వల్ల ఫిర్యాదులు నమోదు చేసుకోవడం పరిష్కరించేందుకు క్షేత్రస్థాయికి బదిలీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏ సమస్యపై ఫిర్యాదు చేసినా ఒకే రకమైన సమాధానం వస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు.
నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారానికి మార్గం చూపుతామంటూ మెసేజులు వెళ్తున్నాయి. కానీ వారం రోజు లు దాటుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జలమండలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నాళ్లు ఎదురు చూ సినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వినియోగదారులు మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారు.
తిష్టవేసిన సమస్యలు..
గ్రేవెన్స్ సెల్‌కు వినియోగదారులు చేసిన ఫిర్యాదులు జలమండలి వ్యాప్తంగా ఎక్కడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కలుషిత నీటి సరఫరా, మ్యాన్ హోల్ సమస్యలు, సీవరేజీ కంప్లయింట్స్, నీటి సరఫరాలో తగ్గుదల, లో ప్రెషర్ వంటి సమస్యలపై జలమండలి గ్రీవెన్స్ సెల్‌కు వందల కొద్ది ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ అందులో పది శాతానికి మించి పరిష్కారం కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్స్ సెల్‌కు అందిన ఫిర్యాదులను అక్కడి సిబ్బంది క్షేత్రస్థాయిలోని మేనేజర్లకు చేరవేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ఎలాంటి పురోగతి ఉండటం లేదు. సమస్య ఉత్పన్నమయిన ప్రాంతానికి చెందిన మేనేజర్లు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
అదేవిధంగా గణేశ్ నవరాత్రులు, దేవీ నవరాత్రులను సాకుగా చూపుతూ సమస్యల పరిష్కారంతో సమస్యలు తీర్చడంలో అలసత్వం వహిస్తున్నారు. ఏ చిన్న సమస్యపైన ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా కలుషిత నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి సిబ్బంది వినియోగదారుల సమస్యలపై స్పందించాలని కోరుతున్నారు. ఇప్పటికే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో క్షేతస్థాయిలో ఏ సమస్యా పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీరని మురుగునీటి సమస్య..
బండ్లగూడ మండలంలోని ఛత్రినాక ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు తాగునీరు రంగుమారి దుర్వాసనతో సరఫరా అవుతున్నాయని ఈనెల 5న గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. సమస్యను అక్కడి జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మరో 4 నాలుగు రోజుల్లో పరిష్కారం అవుతుందని మెసేజ్ వచ్చింది. కానీ పది రోజులు అవుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. జలమండలి సరఫరాలో ఇంకా మురుగు, దుర్వాసనతో కూడిన నీళ్లు సరఫరా అవుతున్నది. దిక్కుతోచని స్థితిలో సంబంధిత జలమండలి అధికారులను సంప్రదించారు. దేవీ నవరాత్రులు కొనసాగుతున్నందున సమస్యను పరిష్కరించలేమని సెలవిచ్చారు. నవరాత్రులు ముగిసేదాకా ఏ పని చేయలేని తేల్చి చెప్పారు. అప్పటి దాకా మురుగు నీరు ఎలా తాగాలని ఆ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

