ఆస్తిపన్ను చెల్లించని వ్యాపారస్తులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం
జీహెచ్ఎంసీ | ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ మార్చి వరకు రూ.1800 కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని

సిటీబ్యూరో, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ మార్చి వరకు రూ.1800 కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా..మంగళవారం నాటి వరకు రూ. 874 కోట్లు మాత్రమే వసూళ్లను రాబట్టుకున్నది.
నిర్ణీత గడువు ముగింపునకు సమయం దగ్గరపడుతుండడం..మరో పక్క బకాయిల జాబితాలో ఎక్కువగా వివిధ వ్యాపారస్తులు, కమర్షియల్ కేటగిరిలో ఉన్న వాళ్లే అధికంగా ఉన్నారని గుర్తించారు.
ఆస్తిపన్ను చెల్లింపులో జాప్యం చేస్తున్న వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
బకాయిల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఈ మేరకు రోజూ ఉదయం టెలికాన్పరెన్స్ ద్వారా ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షిస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా జోన్ల వారీగా సమీక్షలు చేస్తూ వసూళ్లలో వేగం పెంచారు.
ఇందులో భాగంగానే బకాయిదారులకు నోటీసులు జారీ చేయడం, స్పందించని వారిపై చర్యలు తీసుకోవడం లాంటివి చేపడుతున్నారు. వ్యాపారస్తులకు సంబంధించి షాపులను సీజ్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి రూ. 950కోట్లను దాటించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

